దగాపడ్డ 50 మంది రైతన్నలు ఈ పాపం ఎవరిదిదగాపడ్డ 50 మంది రైతన్నలు ఈ పాపం ఎవరిది
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ21 January, 2026E69NEWS

దగాపడ్డ 50 మంది రైతన్నలు ఈ పాపం ఎవరిది

దగాపడ్డ 50 మంది రైతన్నలు ఈ పాపం ఎవరిది

కొనుగోలు కేంద్రం తూకంలో ఉన్న తూకం మిల్లులో దిగుమతి అయ్యాకా మారిందా?

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిపై ఎమ్మెల్యే కన్నెర్ర చేయాలని రైతుల గోస”

పట్టని అధికారులు”ఓ ఉద్యోగి చేతి వాటం అట”

ఆ ఉద్యోగిపై గతంలో కూడా ఇదే ఆరోపణలు ఉన్నాయిట”

గట్టిగా అడిగిన వారికి సెటిల్ మెంట్ లు చేస్తున్నారట

ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల లచ్చన్నగూడెం గ్రామంలో ప్రభుత్వ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ ఏడాది సారవ వరి పంట అమ్మిన సుమారు 50 మంది రైతన్నలు దగా పడ్డట్లు లోగుట్టు.ఈ పాపం ఎవరిది అనేది తేల్చాల్సిన,పర్యవేక్షణ చేయాల్సిన ఉద్యోగులు,అధికారులు మిల్లరుతో కుమ్మక్కయ్యార అనేది నష్టపోయిన రైతులలో తీవ్రమైన చర్చ జరుగుతుంది.వివరాలలోకి వెళితే కొనుగోలు కేంద్రం వారు కాంటాలు వేసి లారీ కు ఎగుమతి చేసినప్పుడు ట్రక్ షీట్ లో రాసి పంపిన తూకం,టిక్కీల సంఖ్య మిల్లర్ దగ్గర దిగుమతి అయ్యాక మరుసటి రోజుకు తూకం తక్కువుగా ఉన్నాయంటూ 100 టిక్కీలకు 10 నుండి 12 టిక్కీల వరకు కోత విధించి ఐకెపి అధికారులు పంపిన ట్రక్ షీట్ లో అధికారులు రాసిన వివరాలను కొట్టి వేసి కింద తక్కువుగా రాసి ఇది ఫైనల్ అని మిల్లర్ చెప్పడం దానిని ధాన్యం అమ్మిన రైతులకు గ్రామంలోని కొనుగోలు కేంద్రం ఉద్యోగులు కటింగ్ తప్పదని చెప్పడం వెనుక అధికారులు,మిల్లరుతో
కుమ్మక్కయ్యారని అనుమానాలకు దారి తీస్తుంది. ఇక్కడ విధులలో ఉన్న ఐకెపి ఉద్యోగి పై గతంలో కూడా ఈ తరహా ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోందని రైతులలో గుస గుసలు వినవస్తున్నాయి.
అయితే ఆ మిల్లరు నాకు అధికార పార్టీ మంత్రి అండ ఉందని అంటున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు అన్యాయం జరగకుండా పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చూస్తుంటే ఈ తరహా మోసాలు జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.మరిన్ని వివరాలు రేపటి సంచికలో విడుదల కానున్నాయి.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *