కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శనకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు. శాసనసభ లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత శ్రీ భట్టి విక్రమార్క గారిని అవమాన పరిచే విదంగా ప్రవర్తించిన స్పీకర్ వైఖరి ని నిరసిస్తూ నేడు చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన.. నిరసన తెలపడం జరిగింది. గూట్ల తిరుపతి గారు మరియు దబ్బట రమేష్ గారు మాట్లాడుతూ ఒక మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా గవర్నర్ గారు లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ చట్టసభలో MLA లను కించపరచడం TRS పార్టీకి తగదు. రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న kcr గారికి చీమకుట్టినట్టు కూడా లేదు అని ఎద్దేవా చేశారు రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు , దబ్బట రమేష్ , మహిళా నాయకురాలు గుమ్మడి శ్రీదేవి , చిలుకల రాయకొంరు , దొడ్డి కృష్ణయ్య , వికలాంగుల చైర్మన్ కోడారి సారయ్య , నక్క భాస్కర్, బుర్ర శ్రీనివాస్ , బొట్ల రవి , భగవాన్ , దబ్బట రవి , నేరెళ్ల సమ్మయ్య , బొట్ల రాజు , నరేష్ , శివ సాయి , రాజయ్య , శ్రీనివాస్ , దబ్బట రవి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *