దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌

పెనుబల్లి మండలంలో 1002 మంది దివ్యాంగులకు రూ.4016/- ఆసరా పెన్షన్ ప్రోసిడింగ్ కాఫిలను అధికారులతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే సండ్ర. తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు, దివ్యంగులకి రూ.4016 నెలవారీ పింఛను అందజేసి వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా దివ్యాంగులకు పెంచిన ఆసరా పెన్షన్లు పెనుబల్లి మండల కేంద్రం సప్తగిరి ఫంక్షన్ హాల్ యందు ప్రభుత్వ అధికారులు మరియు బీఆర్ఎస్ నాయకులతో కలిసి లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అందజేసారు. సంక్షేమ రంగానికి పునాది వేసినది స్వర్గీయ ఎన్టీఆర్ అని తన బాటలోనే పయనించిన స్వర్గీయ వైయస్సార్ కూడా సంక్షేమ రంగానికి పెద్దపేట వేశారని వారి ఆలోచనలకు అనుగుణంగా కేసిఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ సంక్షేమానికి పెద్దపీట వేసి తెలంగాణను దేశానికే దిక్సూచిగా మలిచారని అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూస్తూ పరిపాలన కొనసాగిస్తున్న కెసిఆర్ పార్టీ అభ్యర్థులుగా వారికి నిండు దీవెనలు ఉండాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *