bhadradri kothagudem news todaybhadradri kothagudem news today

జూలూరుపాడు:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు హైస్కూల్లో పిటి ని సస్పెండ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హైస్కూల్లో పీటి గా విధులు నిర్వహిస్తున్న అరుణ కుమారి శుక్రవారం మధ్యాహ్నం పూట తన కారును నలుగురు విద్యార్థులతో కడిగించుకోవడం జరిగిందని అన్నారు. బాధ్యతారహిత హోదాలో ఉండి విద్యార్థులతో పెట్టి చాకిరి చేయించుకోవడం సరైనది కాదని అన్నారు. గతంలోనూ విద్యార్థులతో అనేక వ్యక్తిగత పనులు చేయించుకోవడం జరిగిందని అన్నారు. ఏజెన్సీ ఏరియాలో ఉండకుండా సమయానికి ఉపాధ్యాయులు రాకుండా విద్యార్థులకు ఇలాంటి పనులు చేయించుకుంటూ విద్యను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు వెట్టిచాకిరి చేపిస్తే ఇంకెలా అని ప్రశ్నించారు. తక్షణమే పిటి మేడం పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బోడా అభిమిత్ర పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *