గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కర్నాటిగెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కర్నాటి

సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలలో 19 వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కర్నాటి విజయకుమారి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.వార్డులో ఉన్న ప్రతి ఓటరును శనివారం నాటికి విజయకుమారి తన పతి వెంకటనారాయణరెడ్డి తో కలసి ఐదుసార్లు కలసి ఓటు అభ్యర్థించారు.తనను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.అంతే కాకుండా గతంలో కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అట్టి సానుభూతి కూడా కర్నాటి గెలుపుకు దోహద పడుతుంది. విజయకుమారి,వెంకట నారాయణ రెడ్డి లు మీడియాతో మాట్లాడుతూ తమ గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *