ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం చేసిన ఎమ్మెల్యే మట్టాఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం చేసిన ఎమ్మెల్యే మట్టా

రాగమయి కు చీర సారే పెట్టిన మునగంటి దంపతులు

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం లింగాల గ్రామంలో మునగంటి శ్రీను అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని ఇందిరమ్మ ఇళ్లును సత్తుపల్లి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అనంతరం లబ్ధిదారుడు ఎమ్మెల్యే రాగమయిను తమ ఇంటి ఆడబిడ్డగా బావించి కుంకుమ పెట్టీ చీర,సారే పెట్టీ దీవించారు.
వారికి రాగమయి కాంగ్రెస్ ప్రభుత్వం బహుకరిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఫోటో తో కూడిన చిత్రపటాన్ని ఇచ్చి శాలువ కప్పారు.గృహప్రవేశం సందర్భంగా జరిగిన సత్యదేవుని వ్రతంలో రాగమయి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో:కల్లూరు మున్సిపల్ చైర్మన్ దరావత్ మోహన్ నాయక్,వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి,మట్టా అభిమానులు,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *