ఘనంగా పాకలపాటి వసంతరావు 4 వర్ధంతి సభఘనంగా పాకలపాటి వసంతరావు 4 వర్ధంతి సభ

సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రావి వీరవెంకయ్య భవనంలో అమరజీవి పాకలపాటి వసంతరావు నాలుగో వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వసంతరావు చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కోలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న మరో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు మోరంపూడి పాండురంగారావు,రైతు సంఘం నేత రావుల రాజబాబులు మాట్లాడుతూ పాకలపాటి వసంతరావు సత్తుపల్లి పట్టణంలో పార్టీని నిర్మించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. అంతేకాకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం కడ వరకు కృషి చేశారని తెలిపారు. ఆనాడు పాలకవర్గాలకు వ్యతిరేకంగా కష్టజీవులు పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి అని కొని ఆడారు, ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో:పాకలపాటి మల్లికార్జున్, పాకలపాటి శ్రీనివాసరావు,పాకలపాటి ఝాన్సీ,జాజిరి జ్యోతి, రమేష్,బడేమియా, వెంకటేశ్వరరావు, జిలాని, బెజవాడ లక్ష్మీనారాయణ,
వెంకటేశ్వరావు,అలీ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *