బేస్ లైన్ పరీక్షల నిర్వహణబేస్ లైన్ పరీక్షల నిర్వహణ

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్‌కు దరఖాస్తు చేసిన ప్రతి అభ్యాసకునికి ఓపెన్ స్కూల్ ద్వారా బేస్ లైన్ పరీక్షలు ఆదివారం నిర్వహించబడ్డాయి.ఓపెన్ స్కూల్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు తప్పనిసరిగా ఈ బేస్ లైన్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.జనగామ జిల్లాలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, స్టేషన్ ఘనపూర్ కేంద్రంగా మొబైల్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో టాస్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) బేస్ లైన్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి.ఈ పరీక్షలను జిల్లా ఉల్లాస్/టాస్ కోఆర్డినేటర్ మురళి శంకర్ రావు, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మిశ్ర గండ్ల సంపత్ కలిసి పరిశీలించారు.పరీక్షలు సజావుగా జరుగుతున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.అలాగే ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు విద్యార్థులు క్రమబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు.ప్రధానోపాధ్యాయులు సంపత్ మాట్లాడుతూ, సెలవు రోజులలో నిర్వహించే ఓపెన్ స్కూల్ తరగతులకు హాజరవుతేనే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎం. కళ్యాణి, ఎం. మౌనవ్య, విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *