ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యేఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ10 January, 2026E69NEWS

ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి-ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఈ నెలాఖరు నాటికి కొడవటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రెవెన్యూ,దేవాదాయ,పంచాయతీరాజ్,ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 12వ తేదీలోగా అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఇప్పటికే పూర్తైన పనులకు సంబంధించిన ఎంబి రికార్డులను ఈ నెల 19వ తేదీలోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.సమీక్షకు ముందు ఎమ్మెల్యే స్వయంగా దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల నాణ్యత, వేగంపై అధికారులకు పలు సూచనలు చేశారు.వచ్చే నెలలో దేవాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున,దానిని దృష్టిలో పెట్టుకొని అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.సీఎం పర్యటనకు అనుగుణంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బి ఈఈకి సూచించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ,అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అప్పగించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.అదనపు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, పూర్తైన పనుల ఎంబి రికార్డులను వెంటనే సమర్పించాలని తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,విద్యుత్ శాఖ ఎస్‌ఈ మల్చూర్ నాయక్,పీఆర్ ఎస్‌ఈ చక్రవర్తి,దేవాదాయ శాఖ ఈఈ దుర్గ ప్రసాద్,ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్వేత,ఆర్‌అండ్‌బి ఈఈ రమేష్,ఇరిగేషన్ ఈఈ బసవ ప్రసాద్,ఆర్డీఓ హరికృష్ణ,శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి,ఎఫ్‌డీఓ అప్పలకొండ,తహసీల్దార్ శ్వేతా,దేవస్థానం ఈఓ మహేష్, జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోటుజు కిష్టయ్య,ఎన్ఎస్ఆర్ నాయినేని సంపత్ రావు,జిల్లా కాంగ్రెస్ నాయకులు పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *