ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలోని షెడ్యూల్ కులాలకు చెందిన యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దరఖాస్తులను ఆహ్వానించినట్లు ఎంపీడీవో (ఎఫ్ఏసీ) భూక్యా రంజిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో మీడియాకు తెలిపారు.ఈ పథకాలలో భాగంగా రవాణా రంగంలో విద్యుత్ ద్విచక్ర వాహనాలు, విద్యుత్ త్రిచక్ర వాహనాలు, పశుసంవర్ధక రంగంలో పాలిచ్చే పశువులు, వ్యవసాయ రంగంలో సౌర శక్తి ఆధారిత యూనివర్సల్ పంపు నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అదనంగా వేతన ఉపాధి మరియు స్వయం ఉపాధికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు ప్రభుత్వ ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 8గా నిర్ణయించారు.
ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసి భౌతిక దరఖాస్తులు సమర్పించని వారు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసే వారు కూడా తమ దరఖాస్తులను ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటలలోపు వేంసూరు ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు