
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ మే20
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం రఘునాథ్‌పల్లి గ్రామంలోని ఐకేపి సెంటర్‌ను గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, తేమ శాతం పరీక్షలు, ధాన్యం నిల్వ విధానాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తోందని, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఐకేపి కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఎఈఓ జి. అపూర్వ, రైతులు, గ్రామస్తులు, ఐకేపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు