జడ్పీ హై స్కూల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 2 :
పర్వతగిరి మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ పర్వతగిరి పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు కందుకూరి నవీన్ కుమార్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పర్వతగిరి గ్రామ సర్పంచ్ చీదురు శంకర్ హాజరై తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన కొరకు మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు సమాజానికి దిక్సూచి లైన పాఠశాల ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యత తీసుకోవాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. నవీన్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల ఆశయ సాధనకై ప్రభుత్వ పాఠశాలలు బాధ్యత తీసుకొని పనిచేస్తాయని అందుకు ప్రజలు సహకరించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు మాట్లాడుతూ మండల కేంద్రంలోని రాజకీయవేత్తలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని అది మనందరి బాధ్యత అని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శ్రీధర్, పరశురాములు, శాంతి కిరణ్, ఏ మనోహర్, డాక్టర్ ఎం భాస్కర్, ఏం మౌనిక, శ్వేత, బైరి తిరుపతి, ఎస్ వెంకన్న, డి రవి కుమార్, డాక్టర్ ఎం రాజలక్ష్మి,ఐ.రమేష్ బాబు, ప్రశాంత్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.