టైపింగ్ మాక్ టెస్ట్
తెలంగాణ ఉన్నత న్యాయ స్థానము వివిధ జిల్లా న్యాయస్థానాలలో స్టెనో, టైపిస్ట్, కాపీస్ట్ పోస్టుల భర్తీ నిమిత్తం ఫిబ్రవరి/2026 లో నోటిఫికేషన్ జారీ చేస్తూ ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అప్లై చేసుకోవలని నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ఉన్నత న్యాయ స్థాన అధికార యంత్రాంగం అప్లై చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ను ఏప్రిల్ 10/2026 వ తేదీ శుక్రవారం హైదరాబాద్ నగరంలోనీ వివిధ పరీక్షా కేంద్రాలలో టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉదయం టైపిస్ట్ పోస్టులకు మధ్యాహ్నం కాపిస్ట్ పోస్టులకు పరీక్ష నిర్వహించే విధంగా సంబంధిత అడ్మిట్ కార్డులను అర్హులైన అభ్యర్థులకు జారీ చేయడం జరిగింది. ఈ స్కిల్ టెస్ట్ కు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు బాబా టైప్ ఇన్స్టిట్యూట్ లో 5.04.2026 ఆదివారం ఉదయం స్కిల్ టెస్ట్ అవగాహన నిమిత్తం, దిశా, నిర్దేశం చేస్తూ ఒక గ్రాండ్ మాక్ టెస్టును ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ బాబా నిర్వహించటం జరిగింది. ఈ టెస్ట్ లో విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. ఈ టైపింగ్ మాక్ టెస్ట్ నిర్వహణలో ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ జిల్లా నాయకులు తోట రామారావు పాల్గొని పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగలా వెంకట్, చేతి కృష్ణ, కిషన్ నాయక్ నవీన్, అబ్దుల్, దొడ్డ వెంకటేశ్వర్లు రియాజ్ తదితరులు పాల్గొన్నారు.