గుంజపడుగు హరిప్రసాద్ కరీంనగర్ బాధ్యులు తెలంగాణ రక్షణ సేన
రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా రక్షణ సేన వారి తాటతీస్తుంది.
పవన్ కళ్యాణ్ కు వెన్ను దన్నుగా ఉన్న రాజకీయ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెబుతారు.
కరీంనగర్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్న జెండా పండుగ కార్యక్రమం
గుంజపడుగు హరిప్రసాద్
కరీంనగర్ బాధ్యులు
తెలంగాణ రక్షణ సేన
తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో భాగంగా ఈరోజు మానకొండూరు నియోజకవర్గం లోని శంకరా పట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో మండల నాయకులు చిట్టెంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్, మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జ్ బుడిగె పర్శారం గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి కరీంనగర్ జిల్లా బాధ్యులు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉండడానికి ఆవిర్భవించిన రాజకీయ పార్టీ అని తెలంగాణ ప్రయోజనాలను ఎవరు దెబ్బతీసిన వారిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే తెలంగాణ రక్షణ సేన కర్తవ్యం అని ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్ద దింపడమే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పని చేయాలని వారు పిలుపునిచ్చారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ గత రెండున్నర సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతర పోరాటం చేస్తుందని రాజకీయంగా వెనకబడి ఉన్న వర్గాలను చైతన్యం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే పనిగా కవితమ్మ ముందుకు పోతున్నారని కవితమ్మ నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలంగాణ రక్షణ సేన బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు ఇబ్బంది కలిగితే పోరాటం చేస్తుందని వారు అన్నారు.
తెలంగాణ గడ్డమీదికి వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఇక్కడి ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ బ్యాక్ కిల వెనక ఇక్కడి రాజకీయ నాయకుల హస్తం ఉంది కనుకనే అంత ధైర్యంగా మాట్లాడిన సందర్భం చూసినం తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని ఇక్కడి ఉద్యమకారులను ఎవరు కించపరిచే విధంగా మాట్లాడిన తెలంగాణ ప్రజలు సహించరని ఈ సందర్భంగా వారు అన్నారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం ఒక పండగ వాతావరణం లో కొనసాగుతుందని రానున్న రోజుల్లో మండల స్థాయిలో గ్రామస్థాయిలో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించుకుని కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేనను అత్యంత బలోపేతమైనటువంటి రాజకీయ పార్టీగా తీర్చిదిద్దుతాం అని కరీంనగర్ జిల్లా తెలంగాణ రక్షణ సేన బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకురాలు యండి సల్మ, అత్హర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, మానకొండూర్ నియోజకవర్గ అబ్జర్వర్ మల్లారెడ్డి, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు చెన్నమల్ల చైతన్య, రాష్ట్ర నాయకులు వెలిగెటి రవికుమార్, జిల్లా నాయకులు బాసవేని రాజేందర్ గర్శకుర్తి విద్యాసాగర్ యండి ఉమర్, కొండపాక రాకేష్, మనుపాటి, రమేష్ సుజీత్, మహిళ విభాగం జిల్లా సీనియర్ నాయకురాలు జంగ అపర్ణ, అంజలి, డిటి శిరీష రమేష్, కవిత తదితరులు పాల్గొన్నారు.