పర్వతగిరి పిఎసిఎస్లో ఘనంగా సహకార వారోత్సవాలు
భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై 5 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ఆదేశాల మేరకు జూన్ 29 నుండి జూలై 6 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సహకార వారోత్సవాల”లో భాగంగా పర్వతగిరి పిఎసిఎస్ ఆవరణలో గురువారం కార్యక్రమం ఘనంగా జరిగింది.సొసైటీ చైర్మన్ మోతపోతుల మనోజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పాలకవర్గ సభ్యులతో సొసైటీ అభివృద్ధికి ప్రమాణం చేయించారు.
ముఖ్య అతిథి కేసీటీసీ ప్రిన్సిపాల్ ఎల్.యాకుబ్ మాట్లాడుతూ… యువతను సహకార ఉద్యమంలోకి తీసుకురావడం,ప్రజల్లో అవగాహన పెంచడం,సభ్యుల భాగస్వామ్యం బలోపేతం చేయడం వల్ల రైతులు సొసైటీల నుండి రుణాలు పొంది సకాలంలో చెల్లించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
కార్యక్రమంలో డైరెక్టర్లు లక్ష్మినారాయణ,గంగాధర్ రావు, లక్ష్మయ్య యాక్య,సీఈఓ సురేష్, సంఘ సభ్యులు,సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.