పినరై విజయన్ పై ఈడి దాడులు రాజకీయ కక్షసాధింపే – సిపిఎం
సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత సెంటర్ లో నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన నిర్వహించి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మోరంపూడి పాండురంగారావు
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ నివాసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి నిర్వహించిన దాడులను సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై కేంద్ర సంస్థలను ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వామపక్ష ఉద్యమాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడిని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నది.
కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆ ప్రజాభిమానాన్ని తట్టుకోలేకనే బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.
ఈ విధమైన బెదిరింపులకు, దాడులకు వామపక్ష ఉద్యమం భయపడదని, ప్రజలతో కలిసి మరింత బలంగా పోరాడుతుందని సిపిఎం స్పష్టం చేస్తున్నది. కేంద్ర సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలిక పోగు సర్వేశ్వరరావు రావుల రాజబాబు, చెరకు రత్నకుమారి, గుదే రాము, పిల్లి నాయుడు, కోటయ్య, అర్జున్ రావు, భాష, శివాజీ, భాస్కర్ వెంకటేశ్వరావు, రమేష్ నాగేశ్వరావు, శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.