పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం విజయవంతం
తెలుగు గళం న్యూస్ జనగామ, జూన్ 3
పెద్ద తండా (యం) గ్రామపంచాయతీ పరిధిలో చిటకోడూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రం విజయవంతంగా పూర్తయింది. ఈ కేంద్రం ద్వారా సుమారు 150 మంది రైతుల నుంచి 18 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. రైతులకు సకాలంలో మద్దతు ధర అందేలా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రం విజయవంతం కావడంలో సహకరించిన సోమేశ్వర రైస్ మిల్లు యజమాని మాసెట్టి సంతోష్, రైతులు, లారీ డ్రైవర్లు, హమాలీలు, గ్రామ ప్రజలు మరియు కేంద్ర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే కేంద్ర నిర్వహణలో కీలక పాత్ర పోషించిన సెంటర్ ఇన్చార్జ్ రాజు నాయక్ సేవలను ప్రశంసించారు.అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ కోసం తమ విలువైన భూమిని అందించి సహకరించిన రైతులు గుగులోతు రాములు, దండు రాజు, గుగులోతు తిరుపతిలను ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సివిల్ సప్లై జిల్లా అధికారి హతి రామ్ నాయక్, చిటకోడూరు పీఏసీఎస్ సీఈవో భాస్కర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.రైతులు తమ ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విక్రయించగలిగారని, తూకం, రవాణా తదితర ప్రక్రియలు సక్రమంగా నిర్వహించబడినట్లు సంతోషం వ్యక్తం చేశారు.ఈ విజయవంతమైన ధాన్యం కొనుగోలు కార్యక్రమం రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేసిందని గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు.