ప్రజా సంక్షేమాన్ని మరిచారా?
లచ్చన్నగూడెం లో రాజుకుంటున్న ఇరువర్గాల కూల్ వార్” ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలో గల లచ్చన్నగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పురేటి శ్రీనివాస్ పై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పోతురాజు చక్రధర్ రావు 49 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం పాఠకులకు విదితమే.వైస్ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకున్న విషయం పాఠకులకు విదితమే.అయితే ఈ గ్రామంలో ప్రజా సంక్షేమానికి రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న కూల్ వార్ గ్రహణంగా మారింది.దీంతో గ్రామంలో అభివృద్ధి కుటుపడుతున్న వైనం అగుపిస్తుంది.యాదవ కులస్తుల వీధికి వెళ్ళే దారి వద్ద విద్యుత్ తీగలు కిందకు వేలాడుతుంటే ప్రమాదం జరగకుండా ఉండాలనే ఆలోచనతో గ్రామ సర్పంచ్ విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు తో మాట్లాడి నూతన స్తంభం ఏర్పాటు చేయించి అదనపు ఎత్తులో విద్యుత్ తీగలు అమర్చడం కోసం యోచన చేసి విద్యుత్ స్తంభం పాతితే దానిని రాజకీయం చేస్తూ వేసిన స్థంభాన్ని పీకి వేయాలని కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు దీంతో అధికారులకు తలనొప్పిగా మారినట్లు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కరవ మంటే కప్పకు కోపం వదలమంటే పాము కు కోపం అన్నచందగా అధికారులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రజా శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లు చొరవ చూపించి సమస్యను సానుకూలంగా పరిష్కారం చేయాలని పలువురు అనుకుంటున్నారు.