మత్తు పదార్థాలకు బానిస కావద్దు
చెడు వ్యసనం, కుటుంబం రోడ్డున పడ్డటమే
డీ-అడిక్షన్ సెంటర్ సందర్శించిన డీఎస్పీ అరుణ్ కుమార్
భద్రాచలంలోని స్థానిక డీ-అడిక్షన్ సెంటర్ను సందర్శించి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
మాదక ద్రవ్యాలు, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబ జీవితం ముక్కలవుతుందని మరియు సమాజంలో గౌరవం పోతుందని హెచ్చరించారు.చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత బాధితులు పాత అలవాట్లను పూర్తిగా విస్మరించాలని, ఆత్మవిశ్వాసంతో సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తు కోసం విద్య, ఉపాధి మరియు కుటుంబ బాధ్యతలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీ-అడిక్షన్ సెంటర్ ప్రాంగణంలో డీఎస్పీ, సీఐ తమ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది, డీ-అడిక్షన్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు