రాంపురంలో బడిబాట కార్యక్రమం
రాంపురం ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరు కావడం హర్షనీయం
సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,ప్రధానోపాధ్యాయులు హీరాలాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంపురం లో ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరు కావడం హర్షనీయం,అభినందనీయమని అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాంపురం సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు హీరా లాల్ అన్నారు,ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలోనే ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వాహణకు సంబంధించి అనుమతులు మంజూరు చేయడంలో రాంపురం ప్రాథమిక పాఠశాల యొక్క సంఖ్య మరియు భౌతిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరు చేయడం జరిగిందని గ్రామ ప్రజలు అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల యొక్క కృషి అని ఈ అవకాశాన్ని గ్రామంలోని తల్లిదండ్రులందరూ ఉపయోగించుకొని మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను ప్రీ ప్రైమరీ తరగతులలో అదేవిధంగా ఐదు సంవత్సరాలు దాటిన బడి ఈడు గలిగిన ప్రతి ఒక్కరిని మన గ్రామ పాఠశాలలోనే చేర్పించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మన ఊరి బడిని మనందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు,ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు తల్లిదండ్రులను కలిసినప్పుడు అందరూ కూడా పాజిటివ్ గా స్పందించి ఈ పాఠశాలలోనే పిల్లల్ని చేర్పిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఇందులో అత్యున్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత బోధన చేయడం జరుగుతుందని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పిల్లలకి గతంలో ఇచ్చినట్టుగా ఉచిత పాఠ్యపుస్తకాలు, సన్న బియ్యంతో రోజు విడిచి రోజు కోడిగుడ్డుతో మధ్యాహ్న భోజనంతో పాటుగా ఈ సంవత్సరం నుండి 21 రకాల వస్తువులు కలిగినటువంటి కిట్టును అందజేయనున్నారని ఇలాంటి అన్ని అవకాశాలు కలిగినటువంటి పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్,కనకం గణేష్, రాజేశ్వరి, క్రాంతి,వార్డు సభ్యులు సతీష్,తల్లిదండ్రులు బందు పరశురాములు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు