శ్రీ కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఆవిర్భావ కు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరణ
2008 లో ప్రారంభమైన తెలంగాణ జాగృతి సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా , తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంస్థ యొక్క లక్ష్యాలు నిర్దేశించుకుని గత 18 సంవత్సరాలుగా శ్రీమతి కల్వకుంట్ల కవిత నాయకత్వంలో సమర్థవంతంగా నిర్వహించబడుతుంది . తెలంగాణ సాధన సమయంలోను , తెలంగాణ జాగృతి యొక్క పోరాటం , ఉద్యమంలో తెలంగాణ జాగృతి పాత్ర అనిర్వచనీయం . నీళ్లు నిధులు నియామకాలు ప్రతిపాదికన సాధించుకున్న తెలంగాణ గత పది సంవత్సరాల్లో అనుకున్న మేర లక్ష్యాలను అందుకోవటంలో వెనకబడ్డదని భావించి , సామాజిక తెలంగాణ ధ్యేయంగా శ్రీమతి కలవకుంట్ల కవిత ఒక కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు . ఈనెల 25వ తారీకు అందుకు ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా , ప్రతి నియోజకవర్గం , ప్రతి మండలం , ప్రతి గ్రామం నుండి అన్ని వర్గాల ప్రజలను , మేధావులనుb, విద్యావంతులను , విద్యార్థులను , యువతను , మహిళలను అందరినీ , పార్టీ ఆవిర్భావ సభకి తెలంగాణ జాగృతి పక్షాన ఇదే మా ఆహ్వానం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సమావేశంలో, ఈనెల 25న హైదరాబాద్ మేడ్చల్‌లో, అధ్వయ కన్వెన్షన్ లో జరిగేటువంటి కల్వకుంట్ల కవిత గారి నూతన పార్టీ ఆవిష్కరణ బ్రోచర్‌ను విడుదల చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ , జిల్లా ప్రధాన కార్యదర్శి వనం నాగేంద్ర కుమార్ , రాష్ట్ర కార్యదర్శి కిషన్ నాయక్ , ధరావత్ గణేష్ నాయక్ , భూక్య లక్ష్మణ్ నాయక్ , గుగులోత్ నవిన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .