సత్తుపల్లి పోలీసులకు భారీ విజయం.. డెకాయిటీ ముఠా గుట్టురట్టు
అమాయకులను కోట్ల రూపాయల ఆశ చూపించి మోసం చేసి, నకిలీ పోలీసులుగా నటిస్తూ డబ్బులు దోచుకునే అంతర్రాష్ట్ర డెకాయిటీ ముఠాను సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కేసు వివరాలు:
సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 281/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 310(2), 318(4), 319(2), 204, 61(2) r/w 109 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి చేపట్టగా, కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.
నమ్మదగిన సమాచారం మేరకు గంగారం ప్రాంతంలో ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు.
బాధితుడు:
కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 25, 2026న కేసు నమోదు చేశారు.
మోసం చేసే విధానం:
నిందితులు వివిధ సిమ్ కార్డులు ఉపయోగించి అమాయకులకు ఫోన్ చేసి తమను రియల్ ఎస్టేట్ వ్యాపారులమని పరిచయం చేసుకునేవారు. తమ వద్ద రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉందని, దానిని వైట్ మనీగా మార్చుకోవడానికి సహకరిస్తే పెట్టుబడికి నాలుగు రెట్లు డబ్బు ఇస్తామని నమ్మించేవారు.
బాధితులు డబ్బులతో వచ్చిన తర్వాత డమ్మీ కరెన్సీ ఉన్న బ్యాగ్ చూపించి, డబ్బు లెక్కించే సమయంలో ముందే సిద్ధంగా ఉన్న వ్యక్తులు పోలీసుల వేషంలో వచ్చి దాడి చేసి, దొంగనోట్లు వ్యాపారం చేస్తున్నారని లేదా మోస్ట్ వాంటెడ్ నేరస్తులని బెదిరించి నగదు దోచుకుని పరారయ్యేవారు.
పోలీసుల స్వాధీనం:
- రూ.17.60 లక్షల నగదు
- 2 ఇన్నోవా కార్లు
- 1 ఎర్టిగా కారు
- 1 టీవీఎస్ యాక్సెస్ స్కూటీ
- 16 సెల్ఫోన్లు
- 2 పోలీసు