సామాజిక న్యాయం సమానత్వమే ఊపిరిగా జీవించిన యోధుడు
:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) సత్తుపల్లి డిపోలో ఆదివారం డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి గురజాల పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
భారతదేశానికి ఆయన చేసిన విశేషమైన సేవలు మరువ లేనివని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని అన్నారు. భారతదేశానికి తొలి ఉప ప్రధానిగా ఆయన అత్యంత బాధ్యతాయుతంగా పని చేశారని తెలిపారు.అనంతరం కేక్ కటింగ్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో: డిపో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి,వెల్ఫేర్ కమిటీ సభ్యులు సైదిరెడ్డి, ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ జగన్నాథం, వెంకటయ్య,బసవయ్య, బాలస్వామి,టీ ఐ త్రీ జాకబ్, ఏడీసీలు కిరణ్ బాబు, కాంతారావు,సత్యం,పల్లె వెలుగు బస్ మేనేజర్ కిన్నెర ఆనంద్ వీరితోపాటు గ్యారేజీ సిబ్బంది,ఉద్యోగులు పాల్గొన్నారు.