హరీష్ రావు అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హరీష్ రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ పరిగి నియోజకవర్గం కళాపూర్, రాపోల్ రైతుల భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో 1200 వందల ఎకరాల భూమిని కోల్పోతున్న రైతులను పరామర్శకు వెళ్తున్న క్రమంలో హరీష్ రావు గారిని, అరెస్ట్ చేయడం అత్యంత సిగ్గుమాలిన చర్య ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన మంత్రులు ముఖ్యమంత్రి అండతో నిత్యం చేస్తున్న మైనింగ్ మరియు భూముల దందాలను అసెంబ్లీలో మరియు బయట మీడియాలో ప్రశ్నిస్తున్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారిని ఈరోజు కోకాపేటలోని వారి ఇంట్లో గృహనిర్బంధం చేసి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాము మార్పు పేరుతో, అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల భూములను కబ్జాలు చేయడంతో పాటు అక్రమంగా మైనింగ్ దందాలు చేస్తున్నది. కబ్జాలను, అక్రమ దందాలను అరికట్టవలసిన ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతిపక్షాలను గృహనిర్బంధం చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నాము. మొన్న అదిలాబాద్ లో ఎవ్వరినీ అక్రమ అరెస్టులు చేస్తలేము అని చెప్తూనే నేడు ఈ అరెస్టులకు పాలుపడడం పిరికిపాందా చర్య వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ పార్టీ నేతలు చేస్తున్న భూ కుంభ కోణాలను వెలికితీస్తూ భూమిని కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తున్న హరీషన్న అదే క్రమంలో నేడు పరిగి కి వెళ్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా రైతులకు రైతు భరోసా రాక, రుణమాఫీ చేయక, ఎరువులను సకాలంలో అందించకుండా రైతులన్నలను అరిగోసకు గురిచేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి, అమలు చేసే సత్తా లేక ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ ప్రజలకిచ్చిన హామీల గురించి ప్రజల పక్షాన పోరాటం చేస్తే అక్రమ కేసులా,మీ తాటాకు చప్పుళ్లకు బి ర్ స్ నాయకులు అదిరేది లేదు, బెదిరేది లేదు. మాకు పోరాటాలు, ఉద్యమాలు, కేసులు, జైల్లు అరెస్టులు కొత్త కావు.పోలీసుల బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికం అని మండిపడ్డారు.