ఆర్ఎంపీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీఆర్ఎంపీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీ
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 July, 2026E69NEWS

ఆర్ఎంపీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీ

ఆర్ఎంపీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలపై శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎం అండ్ హెచ్ ఓ) డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీలు నిబంధనలకు లోబడి కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని స్పష్టం చేశారు.నిర్దేశిత నియమాలను ఉల్లంఘించి రోగులకు ఐవీ ఫ్లూయిడ్స్ (సలైన్లు) ఎక్కించడం,ఇంజక్షన్లు ఇవ్వడం,లేదా వివిధ రకాల యాంటీబయాటిక్స్ మందులను సిఫార్సు చేయడం వంటివి చేయరాదని తీవ్రంగా హెచ్చరించారు.తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న రోగులను తక్షణమే సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు.నిబంధనలను అతిక్రమించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్.ఎం.పి ప్రథమ చికిత్స కేంద్రాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ,నిరంతరం తనిఖీలు చేపట్టాలని స్థానిక వైద్యాధికారులను ఆదేశించారు.ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో డాక్టర్ సందీప్,డిడిఎం మధు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *