ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ధర్మసమాజ్ పార్టీ మద్దతు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ధర్మసమాజ్ పార్టీ బీసీ,ఎస్సీ, ఎస్టీ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు సమ్మె స్థలాన్ని సందర్శించి కార్మికులతో సంఘీభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకుడు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ,ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయసమ్మతమైనవని,వాటిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.గతంలో కరెంట్ ఉద్యోగులను మోసం చేసి ఆర్టిజన్ కార్మికులుగా మార్చడం వల్ల వారి సమస్యలు మరింత పెరిగాయని విమర్శించారు.ఈ సమస్యలు విస్తరించి తెలంగాణ ప్రజల సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని,ధర్మసమాజ్ పార్టీ తరఫున కార్మికులతో కలిసి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.కార్మికుల న్యాయమైన హక్కుల కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వంగపండ్ల రాజయ్య యాదవ్, కొయ్యడ రమేష్, రేణిగుంట్ల మహేష్, మహేందర్, శీలపాక హరీష్ తదితరులు పాల్గొన్నారు.