ఉప్పల్ బాగాయత్ భూ పోరాటాన్ని జయప్రదం చేయండి
తెలంగాణ ఉద్యమకారుల కోసం హైదరాబాదు ఉప్పల్ బగాయత్ లో ఉద్యమకారుల కోసం భూ పోరాటం జరుగుతున్నది. దానికి ఉద్యమకారులందరూ హాజరు కావాలని ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకురాలు అనిత చౌదరి మాట్లాడుతూ, గత నెలలో జూన్ 2వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని జూలై 2వ తారీఖు వరకు నిలబెట్టుకోవాలని, అల్టిమేటం జారీ చేయడం జరిగిందన్నారు. జులై 2వ తారీఖు నాటి వరకు ఉద్యమకారులకు పెన్షన్ విధానము, 250 చదరపు గజముల స్థలము ఇవ్వనట్లయితే జులై 2వ తారీఖు నాడు మేమే భూ పోరాటం చేసి ఉప్పల్ బాగాయాత్ లో, 350 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల రాజీలేని పోరాటాలు చేస్తూ, హక్కులను సాధించే విధంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ఉద్యమకారుల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా భూములు స్వాధీనం చేసుకోవడానికి ఖమ్మం జిల్లా కేంద్రం నుండి ఉద్యమకారులు అందరము ఏకమై భారీ ఎత్తున కదలాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు భానోత్ కిషన్ నాయక్ జిల్లా నాయకులు వనం నాగేందర్, గుగులోతు రాజకుమార్ నాయక్, కూరపాటి సురేష్, ఐశ్వర్య భాయ్, సుహాసిని, గుండ్లపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.