ఎస్సీడీడీ బాలుర వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ
విద్యార్థులకు నాణ్యమైన వసతి, పోషకాహారం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి ఖమ్మంజిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శుక్రవారం వేంసూరు ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వసతిగృహంలోని విద్యార్థుల హాజరు, వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, స్టాక్ రిజిస్టర్లు, మెస్ రికార్డులు, సంక్షేమ కార్యక్రమాల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, విద్యాభ్యాసానికి అనుకూల వాతావరణం, అవసరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, వసతిగృహంలో ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించాలని, నాణ్యమైన మరియు పోషకాహారాన్ని అందించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా వసతిగృహ సంక్షేమ అధికారి డా. తిమ్మిడి నాగరాజు వసతిగృహ నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలపై డిప్యూటీ డైరెక్టర్ కి వివరించారు.
ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించేందుకు శాఖ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.
ఈ తనిఖీలో సత్తుపల్లి అసిస్టెంట్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం. వీరయ్య, కల్లూరు అసిస్టెంట్ బీసీ అభివృద్ధి అధికారి గ్రేసమ్మ, వేంసూరు వసతిగృహ సంక్షేమ అధికారి డా. తిమ్మిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.