పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ జిల్లా పరిషత్ సభ్యులు మేడిశెట్టి రాములు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు మేడిశెట్టి రాములు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో జంగా వీరమల్లు కుమార్తె చీరల వేడుకకు హాజరై నూతన వధువును ఆశీర్వదించారు.అనంతరం ఎబి తండాకు చెందిన సీనియర్ నాయకులు,తన మిత్రుడు మాలోత్ మంచా నాయక్ గుండెపోటుతో మరణించడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.విశ్వజెనిత్ పాఠశాల నిర్వాహకులు హరికుమార్ పదవ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమాల్లో మండల ఉప అధ్యక్షులు గంగాధర్ రావు,మాజీ జిల్లా పరిషత్ సభ్యులు మహమ్మద్ సర్వర్,నాయకులు కంటెం ఏకాంతం,కొండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు