ఎస్ ఐ ఆర్ సవరణలో భాగంగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ వన్నాల
గిర్మాజీపేట మండలం 24వ డివిజన్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ సందర్శించారు. గిర్మాజీపేట మండలం 24వ డివిజన్ పరిధిలోని 48, 49, 50, 51, 52, 55, 56, 57, 58, 60, 61 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓటర్ల గణన పత్రాలు నింపుటకు భారతీయ జనతా పార్టీ గిర్మాజీపేట మండల అధ్యక్షులు సీతా నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఎస్కే సేవా సమాజ్లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ కేంద్రంలో ఓటర్లకు అవసరమైన సహాయం, సూచనలు అందిస్తున్నారు. ఈ సహాయ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ వన్నాల వెంకటరమణ పార్టీ కార్యకర్తలకు తగు సూచనలు చేసి, ఓటర్లకు మరింత సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రత్నం సతీష్ షా పాల్గొన్నారు.