చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్
సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం గ్రామ పంచాయతీ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు బాబు) తన జన్మదినాన్ని పురస్కరించుకొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.అనంతరం గ్రామ ప్రజలకు మట్టి కుండలలో నింపిన త్రాగు నీటిని బాటసారులకు,చిన్నారులకు,ప్రజలకు పోశారు.ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి బిందును ఒడిసి పట్టాలని,త్రాగునీటిని వృథా చేస్తే భావితరాలకు అన్యాయం చేసినట్లు అవుతుందని నీటి పొదుపు అందరి బాధ్యతగా గుర్తించాలని,వృధా చేయకూడదని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమ్ములు బాబు అభిమానులు,గ్రామ పంచాయతీ కార్మికులు,వైస్ సర్పంచ్ చిట్టిమాది చెన్నకేశవులు,వార్డుసభ్యులు పాల్గొన్నారు.