రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆ సంఘం ఖమ్మంజిల్లా తృతీయ మహాసభలు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపం,సామినేని రామారావు నగర్లోని కాసాని ఐలయ్య ప్రాంగణంలో త్వరలో జరగనున్నoదున ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు లు ప్రసంగించారు.వారు మాట్లాడుతూ జిల్లాలో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భూభారతి పోర్టల్ లో లోపాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూమి కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు సీతారామ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేసి, రూ. 9 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లాలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు మరమ్మతులు చేపట్టి, రైతులకు నీటి అందుబాటు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు రకాల పంటలకు బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులను గుర్తించి 2011 సాగుదారు చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు జారీ చేసి, బ్యాంకు రుణాలు, పంట అమ్మకాలు, ఎరువుల సబ్సిడీలలో వాటిని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విత్తన చట్టం, విద్యుత్ సంస్థల మార్కెట్ ముసాయిదా బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ మహాసభల్లో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి, నల్లమోతు మోహన్ రావు, కళ్యాణపు కృష్ణయ్య, గుంటుపల్లి వెంకటయ్య, సత్తెనపల్లి నరేష్, షేక్ మస్తాన్, గండమల ఆనందరావు, పెరసాని వెంకటయ్య, పులి వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆ సంఘం ఖమ్మంజిల్లా తృతీయ మహాసభలు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపం,సామినేని రామారావు నగర్లోని కాసాని ఐలయ్య ప్రాంగణంలో త్వరలో జరగనున్నoదున ఆదివారం
నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు లు ప్రసంగించారు.వారు మాట్లాడుతూ జిల్లాలో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భూభారతి పోర్టల్ లో లోపాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూమి కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు సీతారామ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేసి, రూ. 9 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లాలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు మరమ్మతులు చేపట్టి, రైతులకు నీటి అందుబాటు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు రకాల పంటలకు బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులను గుర్తించి 2011 సాగుదారు చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు జారీ చేసి, బ్యాంకు రుణాలు, పంట అమ్మకాలు, ఎరువుల సబ్సిడీలలో వాటిని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విత్తన చట్టం, విద్యుత్ సంస్థల మార్కెట్ ముసాయిదా బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ మహాసభల్లో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి, నల్లమోతు మోహన్ రావు, కళ్యాణపు కృష్ణయ్య, గుంటుపల్లి వెంకటయ్య, సత్తెనపల్లి నరేష్, షేక్ మస్తాన్, గండమల ఆనందరావు, పెరసాని వెంకటయ్య, పులి వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.