మద్దెలగూడెం గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొడ్డు దయాకర్ మాదిగ హనుమకొండ జిల్లా, వేలేరు మండలం మద్దెలగూడెం గ్రామ సర్పంచ్ మరియు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు హనుమకొండ మనోజ్‌ను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తిస్తూ ఈ సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాదిగ హాజరై, మనోజ్ చేసిన సేవలను కొనియాడారు. గ్రామ అభివృద్ధిలో యువ నాయకులు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి గంగానపు శ్రీనివాస మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ, వేలేరు మండల ఎంఎస్పి అధ్యక్షుడు కనకం రాజయ్య, అధికార ప్రతినిధి ఏసు, సీనియర్ నాయకుడు శంకర్, ధర్మసాగర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోంపల్లి అన్వేష్, ఉపాధ్యక్షుడు సింగపురం పవన్, ముప్పారం గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి అనిల్, మండల నాయకులు చిట్యాల రాజు, కొట్టే శివ, రిపిక మహేష్ తదితరులు పాల్గొన్నారు.