జేవీఆర్ ఓసీలో 12 టన్నుల ఎస్కార్ట్ క్రేన్ ప్రారంభం
సింగరేణి సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీలో రూ.22.69 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 12 టన్నుల సామర్థ్యమున్న ఎస్కార్ట్ క్రేన్‌ను ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. జేవీఆర్ ఓసీ లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ) సెక్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన క్రేన్‌ను ప్రారంభించి, గనుల నిర్వహణలో ఆధునిక యంత్రాల వినియోగం పనితీరును మరింత సమర్థవంతంగా మారుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో: జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్వీఆర్ ప్రహ్లాద్, ఎస్వో టు జీఎం బొల్లం శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ కె. సోమశేఖర్ రావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ డి. శ్రీనివాసరావు, ఎస్వోఎం బి. రాజేశ్వరరావు, మేనేజర్ (ఆపరేషన్స్) జి. కళ్యాణ్ రామ్, సేఫ్టీ ఆఫీసర్ ఎస్. గోవింద్, ఎస్ఈ (ఈ&ఎం) ముక్కా శ్రీను, డివిజనల్ ఇంజనీర్ (ఈ&ఎం) పి. గోపి, కాలరీ ఇంజనీర్ జగదీశ్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎస్. సుధాకర్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బి. కోటేశ్వరరావు, సంక్షేమ అధికారులు దారా కావ్య, కె. శ్రీనివాస్‌తో పాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.