తల్లాడలో 108 అంబులెన్స్ తనిఖీలు
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ పట్టణంలోని 108 అంబులెన్స్ సేవలను జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సేవా కేంద్రం,హైదరాబాద్ నుండి వచ్చిన పరిశీలకులు ఫకీరు దాస్, వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు.అంబులెన్స్‌లో ఉన్న వైద్య పరికరాల పనితీరు, మందుల నిల్వలు, గడువు తేదీలు, వాటి నిర్వహణ రికార్డులను సవివరంగా పరిశీలించారు. అలాగే సిబ్బంది విధి నిర్వహణను కూడా సమీక్షించారు.
ఈ సందర్భంగా తల్లాడ 108 అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు గొల్లమందల కృష్ణ, వాహన చోదకుడు ముళ్ళపాటి నరసింహారావు, ఖమ్మం జిల్లా 108 నిర్వాహకుడు అవులూరి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
మూడు జిల్లాలను పర్యవేక్షిస్తున్న కార్యక్రమ నిర్వాహకుడు షేక్ నజీరుద్దీన్ కూడా హాజరై సేవల నాణ్యతపై సూచనలు చేశారు. అత్యవసర సేవలు సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని పరిశీలకులు సూచించారు.