
ఈ69 న్యూస్ | కాజీపేట | ఏప్రిల్ 07
పర్యావరణ పరిరక్షణపై తెలుగు గళం న్యూస్ మార్చి 14న ప్రచురించిన కథనం ప్రభావంతో ఫారెస్ట్ అధికారులు స్పందించి అక్రమ కలప నిల్వపై కేసు నమోదు చేశారు.హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామంలోని ఎస్సార్ కాలేజ్ ఏవీఆర్ క్యాంపస్లో అక్రమంగా కలప నిల్వ ఉన్నట్టు తెలుగు గళం న్యూస్ వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.అనంతరం ఘటనాస్థలిని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టి, కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ రెడ్డి తండ్రి గోపాల్ రెడ్డి పై కేసు నెంబర్ 1372/28-DT: 04-04-2026 కింద పి.ఓ.ఆర్ (POR) కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అధికారుల వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న వేప కలప సుమారు 1.39 క్యూబిక్ మీటర్లుగా గుర్తించారు. దీనిపై రూ.5,000 జరిమానా విధించారు. ఈ చర్యలు వాల్టా చట్టం కింద తీసుకున్నట్లు వెల్లడించారు.అయితే, స్థానికుల వాదన ప్రకారం నాలుగు ట్రిప్పుల కలప ఉన్నప్పటికీ, ఫారెస్ట్ అధికారులు కేవలం ఒక ట్రిప్పుగా మాత్రమే నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.మీడియా కథనానికి స్పందించి అధికారులు చర్యలు తీసుకోవడం సానుకూల పరిణామమని, ఇకపై అక్రమ కలప రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.