జాతీయ జెండాను ఆవిష్కరించిన డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
జాతీయ జెండాను ఆవిష్కరించిన డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
తెలుగు గళం న్యూస్ నర్సంపేట జూన్ 2
నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ పాత్ర చారిత్రాత్మకం ఆనాడు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ బిల్లుకు దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి తెలంగాణ చిన్నమ్మా శ్రీమతి సుష్మా స్వరాజ్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించి తెలంగాణ ఇస్తే మా పార్టీకి రాజకీయంగా నష్టమే అయినా ప్రజల ఆకాంక్ష గొప్పది అని గర్జించిన విషయం తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు అని అన్నారు.అటల్ బిహారీ వాజ్పేయి హయాంలోనే తెలంగాణ ప్రక్రియకు బీజం పడింది అని గుర్తు చేశారు.అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఇప్పటికీ కుటుంబ పాలన అవినీతి నిరుద్యోగం రాజ్యమేలుతున్నాయి.బంగారు తెలంగాణ కేవలం మాటలకే పరిమితమైంది అని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్ నినాదంతో నిజమైన బంగారు తెలంగాణను బీజేపీ మాత్రమే నిర్మించగలదు. నర్సంపేట గడ్డపై కాషాయ జెండా ఎగరవేసి, ప్రతి పేదవాడి కల సాకారం చేసే వరకు మన పోరాటం ఆగదు అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి నియోజకవర్గ బీజేవైఎం నాయకులు జూలూరి మనీష్ గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు, కూనమల్ల పృథ్విరాజ్, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గంగిడి మహేందర్ రెడ్డి ,మాజీ ఎంపిటిసి రాజు, సీనియర్ నాయకులు శీలం సత్యనారాయణ, దుగ్యాల సమ్మయ్య, కొనుగోటి రవీంద్ర చారి,గంధం రాజు, బీజేవైఎం నాయకులు కొంకిస విఘ్నేష్ , మహిళా నాయకురాలు సూత్రపు సరిత, రూరల్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాము, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్,కాసుల నాగేంద్రబాబు సామల ప్రవీణ్ కుమార్ ముత్యాల శ్రీనివాస్, అశోక్, శోభన్, ఎస్టి మోర్చ నాయకులు బానోతు రాజేందర్, కట్ల మహేందర్,పుప్పాల కళ్యాణ్, అరెపెల్లి నర్సయ్య,యువ మోర్చా నాయకులు చిలువేరు అన్వేష్, నిఖిల్,తప్పెట్ల సతీష్ గోస్కులా సందీప్, సామల సాయి తరుణ్ సాయి,గోగుల సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.