జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు
జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు*
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 2
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జీతేందర్ రెడ్డి బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు.ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని,ప్రజల ఆశీర్వాదాలతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్లు బోయినపెల్లి యుగేందర్ రావు,పట్టాపురం ఏకాంతం గౌడ్, మాజీ జడ్పీటీసీ నవత్ పంతులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు రంగు కుమార్,మాజీ మండల రైతు బంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు,మాజీ సర్పంచులు అమడగని రాజు యాదవ్, గొనె సంపత్, కొల్లూరి వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్,చిన్నమాధవ్ రావు, జూల్లపెల్లి దేవేందర్ రావు,డెక్క కుమారస్వామి,బొట్ల మధు,బూర శ్యామ్,పిండి వెంకటేశ్వర్లు,బల్లె వెంకట్రాజు,కందికట్ల ప్రవీణ్,దర్నోజ్ దేవేందర్,జీడి గట్టయ్య,రంగు కుమార్ (ఫర్టిలైజర్), జెంగిలి యాకయ్య,చిరుత విజయ్,దొమ్మటి రాజు,కాంటెమ్ ఏకాంతం,మేడిశెట్టి పరమేష్,జంగా వీరమల్లు,గడ్డల రాజు,బర్ల రాజశేఖర్,దబ్బేట నరేష్, మూడు బాలు,వార్డు సభ్యులు చిన్నపెల్లి విజయ,కొప్పు రాజు, తుంగ రాజు,బొట్ల వెంకన్న,ఇస్లావత్ హరీష్,దూడ్డి హరీష్,బొట్ల శ్రీకాంత్, సోషల్ మీడియా ఇంచార్జి చిన్నపెల్లి అజయ్ తదితర మండల, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.