నారాయణగిరి హైస్కూల్‌లో బాల గ్రామసభనారాయణగిరి హైస్కూల్‌లో బాల గ్రామసభ
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 June, 2026E69NEWS

నారాయణగిరి హైస్కూల్‌లో బాల గ్రామసభ

నారాయణగిరి హైస్కూల్‌లో బాల గ్రామసభ

నారాయణగిరి హైస్కూల్‌లో గౌరవ సర్పంచ్ శ్రీమతి పుట్టా రేణుక కుమార్ అధ్యక్షతన బాల గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంఈఓ, హెచ్‌ఎం బి. రామ్ ధన్ ఆధ్వర్యం వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీమతి పుట్టా రేణుక బాలల సమస్యలు, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. హెచ్‌ఎం బి. రామ్ ధన్ బాలలకు సంబంధించిన చట్టాలు, హక్కులు, బాధ్యతలపై విద్యార్థులకు వివరించారు.కార్యక్రమంలో సర్పంచ్ పుట్టా రేణుక, వార్డు సభ్యురాలు మాచర్ల లక్ష్మి , ఎస్‌ఎంసీ చైర్మన్ బుద్ధి కనకలక్ష్మి , పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్, గ్రామ పెద్దలు పుట్ట కుమార్, బుద్ధ రమేష్, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *