లంబాడీల ఐక్యవేదిక అధ్యక్షులు పల్లవి రాజు నాయక్, ప్రజాప్రతినిధులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
ఘనంగా కృష్ణవేణి-రాందాస్ వివాహ రిసెప్షన్
పాల్గొన్న లంబాడీల ఐక్యవేదిక అధ్యక్షులు పల్లవి రాజు నాయక్, ప్రజాప్రతినిధులు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లా గొల్ల బుద్ధారం పెద్ద తండాలో లావుడియా ఫుల్ బంద్ సీతారాం నాయక్ కుమారుడు కృష్ణవేణి-రాందాస్ వివాహ రిసెప్షన్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.ఈ వేడుకకు లంబాడీల ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పల్లవి రాజు నాయక్, స్థానిక సర్పంచ్ అజ్మీర జైపాల్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వధూవరులు అన్యోన్యంగా ఉంటూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో తారాబాయి, దాసు నాయక్, జ్యోతి బాలు నాయక్, శారద రాము నాయక్, విజయ రఘురాం, అరుణ రాజన్న, వసంత చీమన్ నాయక్, మమత గణపతి, రజిత రాజన్న తదితర ప్రముఖులు పాల్గొన్నారు.వధూవరులను ఆశీర్వదించిన వారిలో గోపి నాయక్, ప్రతాప్ నాయక్, మల్లయ్య, కళ్యాణ్, కార్తీక్, పరం సింగ్, రతన్ సింగ్, రంజిత్ నాయక్, నవీన్ నాయక్ సహా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.