మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు
మొక్కజొన్న రైతుల కన్నీటికి కాంగ్రెస్సే కారణం*
•మద్దతు ధర ₹2400,అమ్మేది ₹1600
•కరోనాలో కొన్న కేసీఆర్.. ఇప్పుడు కొనలేని రేవంత్: రైతుల పక్షాన రహదారిపై ఎర్రబెల్లి ధర్నా
వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న,వరి కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ధర్నాకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంఘీభావం తెలిపారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన ధర్నాలో రైతులతో కలిసి పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ….మొక్కజొన్న కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదు. మద్దతు ధర ఇవ్వాలని ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. మొక్కజొన్న మద్దతు ధర ₹2400 ఉంటే రైతులు ₹1600 నుంచి ₹1800కే అమ్ముకొని మోసపోతున్నారు. రైతుల కన్నీరు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కష్టాలే, మొక్కజొన్న, వరి కొనే దమ్ము లేకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి.వండి ఇచ్చిన వడ్డించడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం. అని మండిపడ్డారు.మనిషిని మనిషి ముట్టుకునే పరిస్థితి లేని కరోనాలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ ది,షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడి నుంచి వస్తుంది. ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి దాపురించింది.అన్ని కష్టాలు భరించి పంట పండిస్తే బస్తాలు కూడా రైతులకు ఇవ్వడం లేదు. ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు మంటలు మండిస్తారు.రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన వల్లే రాష్ట్రంలో ఈ అరిష్టాలు జరుగుతున్నాయి. రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి. తెలంగాణలో స్వర్ణ యుగం రావాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి.కమిషన్లు, పర్సంటేజీలు,భూముల మీదనే మంత్రులకు ఇంట్రెస్ట్ ఉంది. రైతు సమస్యల మీద మంత్రులకు ఇంట్రెస్ట్ లేదు.మండుటెండలో మొక్కజొన్న రైతుల గోసను చూడాలని వరంగల్ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరించినట్లు ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతన్నలు మండల బి ఆర్ఎస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.