పర్వతగిరిలో ఇందిరమ్మ ఇండ్ల సందడి
పర్వతగిరిలో ఇందిరమ్మ ఇండ్ల సందడి
వరంగల్ జిల్లా:పర్వతగిరి: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.పర్వతగిరి మండల కేంద్రంలో శుక్రవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలను ఆయన ప్రారంభించారు.బొట్ల మహేంద్ర – కుమారస్వామి, కాసల మంగమ్మ– కీ.శే. కుమారస్వామి,చింతకుంట్ల స్వరూప–బిక్షపతి, పటేల్ ఎలేంద్ర– నవీన్ కుటుంబాలు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో స్వంత ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ…”పేదల సొంత ఇంటి కల నెరవేర్చడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత గృహం కల్పించడం ప్రభుత్వ ముఖ్య సంకల్పం.అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం.గ్రామాల్లో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుని గృహప్రవేశం జరుపుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనం”అని తెలిపారు.”నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం”అని వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల కుటుంబాలకు బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో,ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ చీదురు శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.