పురుగుల మందు తాగి మహిళా ఆత్మహత్య
ఏడాదిగా నరకయాతన.. చివరకు పురుగుల మందే దిక్కైంది!రేగొండలో విషాదం తీవ్రమైన కాలి నొప్పి,ఇన్ఫెక్షన్తో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించిన వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రేగొండ మండల కేంద్రంలోని రావులపల్లి లో తీవ్ర శోకాన్ని నింపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రావులపల్లి గ్రామానికి చెందిన కొండ లక్ష్మి (65) అనే మహిళకు సుమారు ఏడాది క్రితం కుడి కాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది.అప్పటి నుండి నిరంతరం కాలి నొప్పితో నరకయాతన అనుభవిస్తున్న ఆమె, తీవ్ర మానసిక వేదనకు గురై తరచూ ఆందోళన చెందుతుండేది. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి పురుగుల మందు తాగింది.గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.అయితే ఎంజీఎంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం (జూలై 22) సాయంత్రం 4.25 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచింది.కుడి కాలి ఇన్ఫెక్షన్ వల్ల కలిగిన నొప్పులు, మానసిక వేదన తాళలేకే తన తల్లి పురుగుల మందు తాగి చనిపోయిందని, ఈ మరణంపై ఎవరిపైనా ఎటువంటి అనుమానాలు లేవని మృతురాలి కుమారుడు కొండ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రేగొండ ఎస్సై డి. సుధాకర్ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.