ఆదిలాబాద్ జిల్లా,
ఏప్రిల్ 20 :-

పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్థులపై నిరంతరంగా నిఘా ను ఉంచాలి – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి.

సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి విధులను నిర్వర్తించాలి.

పట్టణంలో సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచే విధంగా ప్రజలను ప్రోత్సహించాలి.

వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించి తనిఖీ నిర్వహించారు. మొదటగా ఆదిలాబాద్ పట్టణ డిఎస్పి వి ఉమేందర్, ఒకటవ పట్టణ సీఐ కే సత్యనారాయణ పుష్పగుచ్చం అందజేసి జిల్లా ఎస్పీని సాదరంగా ఆహ్వానించారు, ఎస్సై అశోక్ ద్వారా ఏర్పాటు చేయబడిన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి పోలీస్ స్టేషన్ కార్యాలయం ను, లాకప్, స్టేషన్ రైటర్, రిసెప్షన్ సెంటర్, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది వాహనాలను, స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను, సిబ్బంది వేచియుండు ప్రదేశాన్ని, పోలీస్ స్టేషన్ నిర్వహణలో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసుల ప్రస్తుత స్థితిగతులను, కోర్టుల నందు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి రిసెప్షన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల వ్యవహరించాల్సిన తీరును, ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంపొందించే విధంగా తీసుకోవలసిన పద్ధతులను, గత మూడు నెలలుగా రిసెప్షన్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారాల లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాత నేరస్తులపై నిరంతరం నిఘాను కొనసాగించాలని తెలిపారు. పెండింగ్ కేసులను త్వరగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జి షీట్ న్యాయస్థానంలో దాఖలు చేయాలని సూచించారు, పరారీలో ఉన్న నిధులను వెంటనే అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బంధాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, స్టేషన్ రికార్డులను ఫైళ్లను క్రమ పద్ధతిలో ఉంచుకోవడానికి 5S విధానాన్ని పాటించి పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేయడానికి సిబ్బందికి అవగాహనను కల్పించాలని తెలిపారు. సంఘటన జరిగిన అనంతరం వేగంగా స్పందించే రియాక్టివ్ పోలీసింగ్ కంటే సంఘటన జరగకముందే ముందస్తుగా పసిగట్టి నివారించే ప్రో యాక్టివ్ పోలీసింగ్ కు ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. మహిళలకు, విద్యార్థులకు, ప్రజలకు డయల్ 100 పై అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పోలీస్ స్టేషన్ అధికారులు తీసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండే విధంగా పోలీసు అధికారులు ప్రజల మధ్యలో ఉండి స్నేహ సంబంధాలను పెంపొందించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, కార్యకలాపాలకు, చర్యలకు అవకాశం లేకుండా పట్టణం పూర్తిగా సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉండే విధంగా ప్రజలను ప్రోత్సహించి సిసిటీవీ కెమెరాలను అమర్చుకునే విధంగా చూడాలని సూచించారు. తద్వారా నేరాలు జరిగే క్రమం తగ్గించడానికి వీలు ఏర్పడుతుందని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ అధికారులు మరింత క్రిత నిశ్చయంతో పనిచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. చివరగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తెలుసుకొని వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీవీ ఉమేందర్, ఒకటవ పట్టణ సీఐ కే సత్యనారాయణ, ఎస్సైలు ఏ హరిబాబు, కే అశోక్, కరీం, ఏ అశోక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News