బీఆర్ఎస్ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
పర్వతగిరి,పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మాజీ సర్పంచ్ల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడికి వెళ్లనున్న బీఆర్ఎస్ నాయకులను పర్వతగిరి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.సోమవారం మండలానికి చెందిన ప్రస్తుత సర్పంచ్ ఏర్పుల శ్రీనివాస్,వడ్లకొండ గ్రామ మాజీ సర్పంచ్,మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అమడగాని రాజు యాదవ్,మాల్య తండా మాజీ సర్పంచ్ బోడ ఈర్యా నాయక్, హట్య తండ మాజీ ఉప సర్పంచ్ తిరుపతిలను వారి నివాసాల వద్దే పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.అరెస్టులతో ఉద్యమాలు ఆగవు: అరెస్టు అనంతరం మాజీ సర్పంచ్ అమడగాని రాజు యాదవ్ మాట్లాడుతూ,అరెస్టులతో తమ ఉద్యమాలను అణచివేయలేరని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న సర్పంచ్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.గ్రామ పంచాయతీల అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తే, ఆ బిల్లులు పెండింగ్లో ఉండటంతో సర్పంచులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.