ఘనంగా 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు విశేష కృషి చేసిన ప్రముఖ మేధావులు ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజి నారాయణరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాధాన్యతను స్మరించుకున్నారు.ప్రధానోపాధ్యాయురాలు తిరునగరి స్వాతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జరిగిన ఉద్యమాలు, అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరిత, సునిత, సంధ్యారాణి, ప్రవీణ్ కుమార్, శిరీష, యమున, సతీష్ తదితరులు పాల్గొన్నారు.అలాగే తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, దేశభక్తి గీతాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.