మధ్యాహ్న భోజన కార్మికులకు వేసవి సెలవుల్లో వేతనం ఇవ్వాలి
మధ్యాహ్న భోజన (వంట) కార్మికులకు వేసవి సెలవుల్లో వేతన ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు.
ఖమ్మంజిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని
ఎర్రుపాలెం మండల కేంద్రం రామిశెట్టి పుల్లయ్య భవనం నందు సిఐటియు అనుబంధ సంఘం మధ్యాహ్న భోజన కార్మికుల చింతిరాల దేవకరణ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సదర్భంగా మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంట కార్మికులు వేలాది మంది గత 24 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనం ఇస్తూ ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటూ కనీసం వేసవి సెలవుల్లో కూడా వేతన ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు..
సుదీర్ఘ కాలంగా వంట కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారంచేటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. అనేక పోరాటాల ఫలితంగా వంట కార్మికులకు వెయ్యి నుండి రెండు వేల వేతనం సాధించుకోవటం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడితే వంట కార్మికులకు 10వేల వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేసారు. వంట కార్మికులకు సామాజిక భద్రత కల్పించే పిఎఫ్, ఈ.ఎస్.ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని, ప్రమాద బీమా పథకం వర్తింప చేయాలని, గతంలో అల్పాహారం చేసిన బిల్లులు, పారితోషిక బకాయిలను సత్వరం చెల్లించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నాం భోజన వంట కార్మికులకు కోడి గుడ్లను, నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో: విజయ,లక్ష్మి, శాంత కుమారి పార్వతి, తదితర కార్మికులు పాల్గొన్నారు.