వరంగల్ జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే రూ.38 వేల వరకు పంట బీమా కవరేజీ లభిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారని వెల్లడించారు.ఫసల్ బీమా యోజన అంటే ఏంటి? 2016లో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా వర్షాలు, వరదలు, భూకంపాలు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.అతి తక్కువ ప్రీమియం రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఖరీఫ్ సీజన్లో 2 శాతం, రబీ సీజన్లో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగతా ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి. బీమా ఎప్పుడు వర్తిస్తుంది? వరదలు, తుఫాన్లు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు, సహజ విపత్తుల వల్ల జరిగే నష్టాలకు ఈ బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టినప్పుడు 14 రోజుల వరకు జరిగే నష్టాలకు కూడా వర్తిస్తుంది. నష్టాన్ని అంచనా వేసిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో అమలు ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కూడా ఈ పథకం అమల్లో ఉంది. రైతులు స్వచ్ఛందంగా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేల ఆర్థిక సాయంతో పాటు బీమా, సబ్సిడీ పథకాలను కూడా కేంద్రం అమలు చేస్తోంది. అయితే చాలామంది రైతులకు ఈ పథకాలపై అవగాహన లేదని అధికారులు పేర్కొంటున్నారు. రైతులు ఈ పథకంలో చేరి లబ్ధి పొందాలని, పంట నష్టపోయినప్పుడు పరిహారం పొం
పంట బీమాతో రూ.38 వేల పరిహారం
•ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే 15 రోజుల్లోనే క్లెయిమ్ – పీఎం ఫసల్ బీమా యోజన వరంగల్ జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే రూ.38 వేల వరకు పంట బీమా కవరేజీ లభిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారని వెల్లడించారు.ఫసల్ బీమా యోజన అంటే ఏంటి?
2016లో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా వర్షాలు, వరదలు, భూకంపాలు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.అతి తక్కువ ప్రీమియం రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఖరీఫ్ సీజన్లో 2 శాతం, రబీ సీజన్లో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగతా ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి.
బీమా ఎప్పుడు వర్తిస్తుంది?
వరదలు, తుఫాన్లు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు, సహజ విపత్తుల వల్ల జరిగే నష్టాలకు ఈ బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టినప్పుడు 14 రోజుల వరకు జరిగే నష్టాలకు కూడా వర్తిస్తుంది. నష్టాన్ని అంచనా వేసిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో అమలు ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కూడా ఈ పథకం అమల్లో ఉంది. రైతులు స్వచ్ఛందంగా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేల ఆర్థిక సాయంతో పాటు బీమా, సబ్సిడీ పథకాలను కూడా కేంద్రం అమలు చేస్తోంది. అయితే చాలామంది రైతులకు ఈ పథకాలపై అవగాహన లేదని అధికారులు పేర్కొంటున్నారు.
రైతులు ఈ పథకంలో చేరి లబ్ధి పొందాలని, పంట నష్టపోయినప్పుడు పరిహారం పొం