హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ
మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్స పిల్లల్లో వినికిడి లోపం, ముఖ్యంగా పుట్టుకతోనే లేదా చిన్న వయస్సులోనే ఉంటే, మాటల అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మరియు మొత్తం జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మైక్రోటియా వంటి పరిస్థితిల్లో బయటి చెవి సరైన రీతిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల వినికిడి లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యను సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే, పిల్లల భాషా అభివృద్ధి ఆలస్యమవడంతో పాటు వారి విద్యా, సామాజిక అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆధునిక ఈఎన్టీ వైద్యంలో బీసీ కన్డక్షన్ హియరింగ్ ఇంప్లాంట్స్ (ఓ ఎస్ ఐ ఏ వంటి పద్ధతులు) ఎంతో సమర్థవంతమైన పరిష్కారాలుగా నిలుస్తున్నాయి. ఈ విధానంలో శబ్ద తరంగాలను నేరుగా అంతర్గత చెవికి పంపించడం ద్వారా బయటి లేదా మధ్య చెవిలో ఉన్న లోపాలను అధిగమించి వినికిడి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు చిన్ననాటి నుంచి కుడి చెవిలో వినికిడి లోపం ఉండగా, మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతంగా చికిత్స అందించారు. పరీక్షల అనంతరం ఆమెకు ‘రైట్ మైక్రోటియా విత్ హియరింగ్ లాస్’ అని నిర్ధారించగా, వైద్యులు శస్త్రచికిత్సను సూచించారు. యశోద ఆసుపత్రి యాజమాన్యం స్పందన ఈ కేసు యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆధునిక ఈఎన్టీ వైద్య సేవలు, నిపుణుల శస్త్రచికిత్స నైపుణ్యం, మరియు రోగి-కేంద్రిత వైద్య విధానానికి నిదర్శనమని యాజమాన్యం పేర్కొంది. క్లిష్టమైన పిల్లల వినికిడి సమస్యలను కూడా అత్యున్నత ప్రమాణాలతో చికిత్స చేసే సామర్థ్యం ఆసుపత్రి ప్రత్యేకతగా వారు తెలిపారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక నిర్ధారణ సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల సమన్వయం ఈ విజయానికి కారణమని వెల్లడించారు. మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాస్ రెడ్డి, మరియు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికత, నిపుణుల బృందంతో పిల్లల్లో వినికిడి లోపాలను సమర్థవంతంగా చికిత్స చేస్తున్నామని తెలిపారు. ముందస్తు చికిత్స ద్వారా పిల్లల భవిష్యత్ అభివృద్ధిని మెరుగుపరచడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.