




ఈ 69న్యూస్ | వరంగల్ | ఏప్రిల్ 08
వరంగల్ జిల్లాలోని నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో బుధవారం ఉదయం 7 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది.స్థానికుల వివరాల ప్రకారం, పక్కపక్కనే వస్తున్న వాహనాల మధ్య ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన కారు, లారీకి తగిలి రివర్స్ అవుతూ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు టీచర్లు విధులకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రకారం, ఆ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటం ప్రధాన కారణమని చెబుతున్నారు. రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడంతో వాహనాలకు సరిపడా స్థలం లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఓవర్టేక్ చేసే వాహనాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు విస్తరణ చేపట్టాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.